నంద్యాల జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించే నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 48 పరిశ్రమల యూనిట్లకు రూ.3.91 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.