W.G: ఏపీలోని పాల ఉత్పత్తుల్లో జిల్లా 3వ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఫసల్ బీమా ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించి, పీఎంఎఫ్బీవై పంటల బీమా పథకంలో డిసెంబర్ 31లోపు పెద్ద మొత్తంలో చేర్పించేందుకు కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు.