ప్రకాశం: బల్లికురవ మండలంలోని అన్ని గ్రామాలలో రోజు వారి కూలీలు వసలలు పోకుండా ఉపాధీ హమీ పథకం ద్వారా పనులు కల్పించాలని ఎంపీడీవో కె.కుసుమకుమారి కోరారు. బుధవారం స్థానిక ఉపాధీ హమీ కార్యలయంలో సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఎంపీ డీవో మాట్లాడుతూ.. 2024- 25 సంవత్సరాలకు కూలీలకు అవసరమైన పను లను గుర్తించి ప్రతిపాదనలను సిబ్బంది తయారు చేయాలన్నారు.