VSP: అక్కిరెడ్డిపాలెం విశాఖ డెయిరీ గెట్ వద్ద మహిళా కార్మికులు వర్షంలో సైతం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బుధవారం రాత్రి పాల సరఫరాను అడ్డుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చి న్యాయం చేసే వరకు పాల సరఫరాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కాగా యాజమాన్యం స్పందించి వారితో మాట్లాడటంతో తాత్కాలికంగా నిరసనను విరమించారు.