భారత్-చైనాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడం కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో చైనా వైస్ ప్రెసిడెంట్ హాన్ జెంగ్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు స్థిరమైన అభివృద్ధిలోకి తెచ్చేందుకు రెండు దేశాలు క్రమంగా ఆర్థిక, వాణిజ్య, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పరం సహకారాన్ని పునరుద్ధరించాలని పేర్కొన్నారు.