ప్రకాశం: యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా విజయవాడలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో జన విజ్ఞాన వేదిక నాయకురాలు షేక్ బషీరున్నిసా ప్రతిభ కనబరిచారు. ముఖాభినయం, నాటక పద్యాల పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆమె ప్రస్తుతం కనిగిరి మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు.