పశ్చిమ దేశాలపై నమ్మకం లేక.. భారత్ సహా ఇతర దేశాలతో బలమైన సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నట్లు రష్యా వెల్లడించింది. అమెరికా.. ప్రపంచంలో సంఘర్షణలను పెంచుతోందని రష్యా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరి గెరాసిమోవ్ వ్యాఖ్యానించారు. కీలకమైన యుద్ధ ఆయుధ నియంత్రణ ఒప్పందాలను ఆ దేశం బలహీనపరుస్తుందని ఆరోపించారు. అందుకే చైనా, భారత్, ఇరాన్, ఉత్తర కొరియా, వెనెజువెలా దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకుంటున్నామని చెప్పారు.