ASR: అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు దూరప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. మంచు సోయగాలను చూసి ఫిదా అవుతున్నారు. అలాగే ఫోటోలకు దిగుతున్నారు. ఈ రెండు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.