VZM: తూర్పు కోస్తా రైల్వే పరిధి సంబల్ పూర్ డివిజన్ డొయికల్లు మునిగడ బిస్సంకటక్ మధ్య మూడో లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో రైళ్లు గమ్యస్థానాలు కుదించినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. జనవరి 3 నుంచి 8 వరకు రైలు నెంబర్ 08504 విశాఖ భవానీపట్న, భవానీపట్న విశాఖ 4 నుంచి 9 వరకు (08503) రాయగడ వరకు నడిపేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు.