NLR: దోమ కాటు పట్ల అశ్రద్ధ వహించవద్దని నెల్లూరు జిల్లా వైద్యులు సయ్యద్ ఆయూబ్ అప్సర్ తెలిపారు. దోమ కాటుతో వైరస్ సోకితే ప్రధానంగా జ్వరమొస్తుందని, వాటితోపాటు తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కళ్ల మంట, కళ్ల కలక, పొత్తి కడుపులో నొప్పి, అలసట, జాయింట్ నొప్పులు వస్తాయన్నారు. ఇలాంటి లక్షణాలుంటే సొంత వైద్యాన్ని వీడి డాక్టర్ను సంప్రదించాలన్నారు.