డేటింగ్ రూమర్స్‌పై రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని చెబుతానని తెలిపారు. సెలబ్రిటీని కావడం వల్ల తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారని, దాన్ని తాను తప్పుగా భావించనని పేర్కొన్నారు. కాగా, రష్మికా మందన్నతో విజయ్ డేటింగ్లో ఉన్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.