ప్రకాశం: సక్షం అంగన్వాడీ కేంద్రాలుగా సంతమాగులూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 9 సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని స్థానిక సీడీపీవో దాసరి సుధా తెలిపారు. సంతమాగులూరు మండలంలో-2, బల్లికురవ మండలంలో-7 కేంద్రాలను ఎంపిక చేసినట్టు ఆమె చెప్పారు. ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వ నిధులతో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని చెప్పారు.