5గంటల పాటు ఓ విద్యార్థి కోటీశ్వరుడిగా మారిన ఘటన బిహార్ ముజఫర్‌నగర్‌లో జరిగింది. సైఫ్ అలీ అనే విద్యార్థి మనీ విత్‌డ్రా కోసం ATMకు వెళ్లాడు. బ్యాలెస్స్ చెక్ చేయగా రూ.87 కోట్లు ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. కొంతసేపు తర్వాత కూడా అంతే కనిపించడంతో తన తల్లికి చెప్పాడు. ఆమె మరో వ్యక్తికి చెప్పడంతో అతను అలీ ఖాతాను పరిశీలించగా.. రూ.532 మాత్రమే కనిపించాయి. దీనిపై అలీ బ్యాంక్‌కు ఫిర్యాదు చేయగా విచారణ ప్రారంభించారు.