ప్రకాశం: అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి రెవెన్యూ కార్యాలయం వద్ద రేపు రెవెన్యూ సదస్సు కార్యక్రమం జరుగుతుందని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీ చరణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరవుతారని అని చెప్పారు. అర్జీదారులు ఈ రెవెన్యూ సదస్సును వినియోగించుకోవాలని కోరారు.