ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. 500 మీటర్లకు విజిబిలిటీ పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 448 పాయింట్లకు చేరింది. దీంతో ‘సివియర్ ప్లస్’ కేటగిరిలో వాయుకాలుష్యం ఉంది. ఇప్పటికే కాలుష్య నియంత్రణకు ఢిల్లీలో GRAP-4 చర్యలు చేపట్టారు. పాఠశాల విద్యార్థులకు హైబ్రిడ్ మోడ్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. కాలుష్యం నేపథ్యంలో ఆరోగ్య సమస్యలున్నవారు బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.