Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) కల్వకుంట్ల కవితపై (kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు ప్రశ్నల వర్షం కురుపిస్తోన్నారు. ఈ రోజు ఉదయం నుంచి.. దాదాపు 9 గంటల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. సాయంత్రం ఏజీ వెళ్లడంతో హైటెన్షన్ నెలకొంది. కవిత లాయర్లు గండ్ర మోహన్, భరత్.. వైద్యులు.. అందులో ఒక మహిళ ఉండటంతో ఇక అరెస్ట్ తప్పదనే ప్రచారం జరిగింది.
Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) కల్వకుంట్ల కవితపై (kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు ప్రశ్నల వర్షం కురుపిస్తోన్నారు. ఈ రోజు ఉదయం నుంచి.. దాదాపు 9 గంటల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. సాయంత్రం ఏజీ వెళ్లడంతో హైటెన్షన్ నెలకొంది. కవిత లాయర్లు గండ్ర మోహన్, భరత్.. వైద్యులు.. అందులో ఒక మహిళ ఉండటంతో ఇక అరెస్ట్ తప్పదనే ప్రచారం జరిగింది. కానీ వైద్యులు తిరిగి వచ్చారు. ఈడీ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ నేతలు చేరుకుంటారు. దీంతోపాటు పోలీసుల బలగాలను కూడా భారీగా మొహరించారు. ఇదిలా ఉంటే.. కాసేపటి నుంచి ఈడీ ఆఫీసు వద్ద వర్షం కురుస్తోంది. అయినప్పటికీ కవిత విచారణ కొనసాగుతూనే ఉంది. 11వ తేదీన కూడా ఇలానే సుధీర్ఘంగా విచారించి.. పంపించేశారు.
16వ తేదీన విచారణకు కావాలని కోరగా.. అనారోగ్య కారణాలతో కవిత రాలేరు. తన న్యాయవాదిని పంపించగా.. కవిత రావాలని ఈడీ అధికారులు స్పస్టంచేశారు. మరోసారి నోటీసులు జారీచేసి.. 20వ తేదీన తప్పకుండా రావాలని తేల్చిచెప్పారు. దీంతో ఈ రోజు కవిత విచారణకు వచ్చారు. ఢిల్లీలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, కవిత భర్త అనిల్, ఇతర నేతలు ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా ఆత్మీయ సందేశం ఇచ్చారు. కవిత అరెస్ట్ అవుతారని ఇండైరెక్టుగా అందులో ప్రస్తావించారు. అన్నింటికీ సిద్దంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.