ఆసిఫాబాద్ పట్టణంలోని మినరల్ వాటర్ ప్లాంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో 13 మినరల్ వాటర్ ప్లాంట్లను CI బాలాజీ వరప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ప్రతి ప్లాంట్లో లైసెన్స్లు, నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా ప్లాంట్ నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.