»Delhi Excise Policy Case Brs Mlc K Kavitha Arrives At Ed Office For Questioning
Delhi Excise Policy Case: ఈడీ కార్యాలయానికి కవిత, సిసోడియాతో కలిపి విచారణ?
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Excise Policy Case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) సోమవారం ( మార్చి 20) ఈడీ ఎదుట విచారణకు (enforcement directorate inquiry) హాజరు అయ్యారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Excise Policy Case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) సోమవారం ( మార్చి 20) ఈడీ ఎదుట విచారణకు (enforcement directorate inquiry) హాజరు అయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమెతో పాటు భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, లాయర్ సోమా భరత్ చేరుకున్నారు. అనంతరం కవిత… ఈడీ కార్యాలయం లోకి (ED office) వెళ్లారు. నేడు విచారణ నేపథ్యంలో నిన్న బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో భర్త అనిల్, సోదరుడు, ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు, తదితరులతో కలిసి కవిత ఢిల్లీకి చేరుకున్నారు. తుగ్లక్ రోడ్డులోని తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో ఉన్నారు. నేడు ఉదయం పదిన్నర గంటల తర్వాత ఈడీ కార్యాలయానికి విచారణ కోసం హాజరయ్యారు.
లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లై (arun ramachandran pillai)తో కలిసి ఆమెను విచారించనున్నారని తెలుస్తోంది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను (Manish Sisodia) కూడా ఈడీ అక్కడకు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయనను కూడా గతంలోనే ఈడీ అరెస్ట్ చేసింది.
కవిత ఈ నెల 11వ తేదీన తొలిసారి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత 16వ తేదీన రెండోసారి హాజరు కావాలని చెప్పినప్పటికీ, ఆమె తన న్యాయవాది ద్వారా సమాచారం పంపించారు. దీంతో ఆ తర్వాత ఈడీ మీరు హాజరు కావాలంటూ మరో నోటీసు ఇచ్చింది. ఇందులో 20వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ఈ అంశంపై ఆమె సుప్రీం కోర్టుకు (Supreme Court) వెళ్లినప్పటికీ ఎదురు దెబ్బ తాకింది. దీంతో ఈ రోజు ఈడీ ఎదుట హాజరు కావాల్సి వచ్చింది.