KDP: పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాష ఆకాంక్షించారు. కడప నగరంలోని 34వ డివిజన్ ఖలీల్ నగర్లో కార్పొరేటర్ అలీ అక్బర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ పవిత్రతను పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.