ASF: బెజ్జుర్ మండలంలోని అందుగుల గూడా గ్రామ రైతు కోరేత ప్రవీణ్ కుమార్ ఇంట్లో శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ప్రవీణ్ వ్యవసాయ పనుల నిమిత్తం చేనుకు వెళ్లగా కరెంట్ షార్ట్ సర్కుట్తో ఇల్లు, 10 క్వింటాళ్ల పత్తి, బీరువాలు, సర్టిఫికెట్లు ఖాళీ బూడిద అయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నాడు.