సామూహిక అత్యాచారం కేసులో ఎనిమిది మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. నవంబర్ 17న గువాహటీలోని ఓ ఆలయ పరిసరాల్లో యువతిపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డు చేయగా.. తాజాగా అవి వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అయితే బాధితురాలు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.