జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ బన్నీతో న్యాయవాదుల బృందం చర్చలు జరిపారు. 45 నిమిషాల పాటు పలు అంశాలపై ఆయనతో లాయర్ నిరంజన్ రెడ్డి చర్చించారు. అనంతరం గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి నిరంజన్ రెడ్డి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ కూడా తాజాగా తన నివాసానికి చేరుకున్నారు. భార్య బిడ్డలను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు.