గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ మామ చంద్రశేఖర్ రెడ్డిని కలిశారు. అనంతరం మామగారి ఇంటికి చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచి అల్లు అర్జున్ భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హ.. చంద్రశేఖర్ ఇంట్లో ఉండటంతో వారిని కలిసేందుకు వెళ్లారు. వాళ్లని కలిసి అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని బన్నీ నివాసానికి వెళ్లనున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.