అల్లు అర్జున్ను నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పలువురు సినీ ప్రముఖులు ఐకాన్ స్టార్‌కు బాసటగా నిలిచారు. ‘సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన బాధాకరం. అయినప్పటికీ జరిగిన ఘటనకు ఒక్కరినే బాధ్యులుగా చేయటం సరికాదు.’ అంటూ అల్లు అర్జున్‌కు మద్దతుగా తమ సంఘీభావాన్ని ప్రకటించారు.