బెయిల్ ఉత్తర్వుల కాపీ జైలు అధికారులకు ఆలస్యంగా అందడంతో అల్లుఅర్జున్ రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. దీంతో అల్లు అర్జున్ను అండర్ ట్రైల్ ఖైదీగా పరిగణించి ఖైదీ నంబర్ 7697ను ఆయనకు కేటాయించినట్లుగా సమాచారం. అర్జున్ రాత్రంతా జైలులోని మంజీరా బ్యారక్‌లోనే ఉన్నారని.. ఆయనతో పాటు మరో ఇద్దరు విచారణ ఖైదీలు అందులోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇవాళ ఉదయం 7 గంటలకు అల్లు అర్జున్ విడుదల కానున్నారు.