»Rain News Two More Days Of Rain In Telangana And Ap March 19 20 21st 2023
Rain News: తెలుగు రాష్ట్రాల్లో ఇంకో రెండు రోజులు వానలు!
తెలుగు రాష్ట్రాల్లో(telangana, ap) మరో రెండు రోజులు కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే(rain fore cast) అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత రెండురోజులుగా తెలంగాణ, ఏపీలో అనేక చోట్ల వర్షం కురిసింది.
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా.. కొంకణ్ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. నేడు,రేపు కూడా వరుణుడు విజృంభించనున్నాడు. మారిన వాతావరణం కారణంగా. ఏపీలోను కూల్ క్లైమాట్ ఏర్పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
తెలంగాణ(telangana)లో రెండు రోజులు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత రెండురోజులుగా తెలంగాణలో అనేక చోట్ల వర్షం కురిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు(hyderabad)లోని పలు ప్రాంతాల్లో కురిసిన కుంతపోత వానతో అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షాల కారణంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం రెండు ద్రోణులు – ఒకటి బంగ్లాదేశ్ నుంచి కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు, మరొకటి తమిళనాడు నుంచి కొంకణ్ తీరం వరకు కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఆ క్రమంలో రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు మరికొన్నిచోట్ల తేలికపాటి లేదా మోస్తరు జల్లులు కురుస్తాయని వెల్లడించింది. దీంతోపాటు 30 నుంచి 40 kmphతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్(adilabad), కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ(hanmkonda), వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి(rangareddy) జిల్లాలకు మరోసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు అనేక రోజులుగా ఎదురుచూస్తున్న వర్షాలు ఈ వారం చివరి వరకు అనేక రాష్ట్రాల్లో కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలో పంటలు వేసుకున్న రైతులు(farmers) అప్రమత్తంగా ఉండాలని అధికారులు(officers) సూచించారు. ఈ క్రమంలో వరి, చెరకు, జొన్నలు, కూరగాయలు వంటి పంటలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఇప్పటికే రెండు రోజులుగా కురుస్తున్న వానలకు అనేక చోట్ల రైతులకు పంట నష్టం(crop loss) సంభవించింది.