ఇటీవల ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. సినిమాల పరంగా కంటే వ్యక్తిగత సమస్యలతో టాలీవుడ్ నటులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపులతో జానీ మాస్టర్ అరెస్ట్, ఎన్ కన్వెన్షన్ అంశం, సమంత-చైతూ విడాకుల విషయంలో నాగ్ ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం, మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు, అల్లు అర్జున్ అరెస్ట్.. ఇలా వరుస ఘటనలు ఇండస్ట్రీ వర్గాలను కలవరపరుస్తున్నాయి.