తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మీడియా ప్రతినిధి రంజిత్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్ బాబు పిటిషన్ వేశారు. కాగా, మంచు ఫ్యామిలీలో వివాదాల నేపథ్యంలో జల్పల్లి నివాసం వద్ద జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే.