అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనతో పాటు పవిత్రగౌడ తదితరులకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ను జూన్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.