నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్’ 2023లో రిలీజై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 2025 శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న ఇది రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.