ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి స్టేషన్కు తరలించారు. బన్నీపై 105, BNS 118(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో 5-10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడనుంది. కాగా, తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైన విషయం తెలిసిందే.