కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి హీరో సందీప్ కిషన్ తాజాగా పంచుకున్నారు. ‘నేను సినిమాల్లోకి వెళ్తానని చెబితే మొదట అమ్మ నాన్న అంగీకరించలేదు. ఆ తర్వాత ఓకే అన్నారు. స్నేహగీతం సినిమా తర్వాత నా తల్లిదండ్రులను సెట్‌కు ఎప్పుడూ పిలవలేదు. ఆ సినిమా సెట్లో జరిగిన ఘటన నన్ను ఇబ్బంది పెట్టింది. ఒకవేళ నాకు చెప్పకుండా వాళ్లు వస్తే.. 15 నిమిషాల్లో అక్కడి నుంచి పంపించేస్తాను’ అని చెప్పారు.