సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అరెస్టైన హీరో అల్లు అర్జున్ని పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి బన్నీని తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. ఇవాళ కోర్టుకు వెళ్లకపోతే రేపు రెండో శనివారం, తర్వాత ఆదివారం సెలవు కావటంతో ఐకాన్ స్టార్ రెండు రోజులు జైలులోనే ఉండాల్సి ఉంటుంది.