YS Sharmila:పేపర్ లీకేజీలో బోర్డు చైర్మన్, మంత్రుల హస్తం: షర్మిల
YS Sharmila arrest:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను (YS Sharmila) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తన నివాసం నుంచి TSPSC ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. గేట్ వద్ద ఆమె వాహనాన్ని అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
YS Sharmila arrest:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను (YS Sharmila) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తన నివాసం నుంచి TSPSC ముట్టడికి బయలుదేరిన షర్మిలను (YS Sharmila) పోలీసులు అడ్డుకున్నారు. గేట్ వద్ద ఆమె (YS Sharmila) వాహనాన్ని అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పేపర్ లీకేజీపై చర్యలు ఎందుకు తీసుకోలేదనే అంశంపై ధర్నా చేయడానికి వెళుతున్నానని షర్మిల (YS Sharmila) పోలీసులతో చెప్పారు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని… తమకు సహకరించాలని షర్మిలను వారు కోరారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.
TSPSCలో పేపర్ లీకేజీ పెద్ద పెద్ద స్కాం అని షర్మి ల (YS Sharmila) అన్నారు. అందరూ కుమ్మక్కై చేసిన స్కాం అని చెప్పారు. SIT అనుకూలంగా విచారణ చేస్తుందని.. అందుకే లీకేజీపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలన్నారు. బోర్డు చైర్మన్.. మంత్రుల స్థాయిలో హస్తం ఉందని షర్మి ల (YS Sharmila)అనుమానం వ్యక్తం చేశారు. ప్రశ్న పత్రాలు కావాలనే లీక్ చేశారని ఆరోపించారు. బోర్డు రద్దు చేయాలని కోరారు. పేపర్ లీకేజీతో TSPSC నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం TSPSCలో రిజిస్టర్ చేసుకున్నారని వివరించారు.
బోర్డు చైర్మన్,సెక్రటరీకి తెలిసే పాస్ వర్డ్.. బయటకు ఎలా లీక్ అయ్యాయని అడిగారు. అంగట్లో సరుకులు అమ్మునట్లు TSPSC పేపర్లు అమ్ముతున్నారని షర్మి ల (YS Sharmila) ధ్వజమెత్తారు. AE పేపర్ కాదు అన్ని పేపర్లు లీకై ఉంటాయన్నారు. గ్రూప్ 1 కూడా లీక్ అయ్యి ఉంటుందని చెప్పారు. TSPSC విశ్వసనీయత ఎంటీ? రహస్యంగా ఉండాల్సిన సమాచారం బయటకు ఎలా వచ్చిందని అడిగారు. TSPSC సర్వర్ ఎలా లీక్ అవుతుందని షర్మిల (YS Sharmila) అడిగారు. కవిత కేసుల మీద ఉన్న శ్రద్ధ TSPSC పేపర్ లీక్ మీద లేదన్నారు. ఘటనపై సీఎం కేసీఆర్ ఇంత వరకు ఎందుకు స్పందించడం లేదన్నారు.
కేసీఆర్ మోనార్క్..నియంత అన్నారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదు.. కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలు అవుతుందన్నారు. పేపర్లు సంతలో అమ్మినట్లు అమ్మడం కేసీఆర్ రాజ్యాంగం అన్నారు. ప్రతిపక్షాల గొంతునొక్కడం కేసీఆర్ రాజ్యాంగం అని చెప్పారు.