MDK: ఆందోల్ మండలం అన్నాసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు డాకూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.