ప్రకాశం: కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం వద్ద మంగళవారం రాత్రి ఆగి ఉన్న ఆర్మీ కంటైనర్ లారీని బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఢీకొన్న నేపథ్యంలో బుధవారం మెదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానం గురించి ఆయన క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. బియ్యం యజమాని దగ్గర నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.