KNR: రోడ్లు, భవనాలశాఖ ద్వారా మానకొండూర్ నియోజకవర్గంలో రూ.100 కోట్లతో కొత్త పనులు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులే కాకుండా కొత్త పనులకు నిధుల మంజూరు, పెండింగ్ పనుల పూర్తి చేయించాలని కోరుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన ఛాంబర్లో కలిశారు.