కోనసీమ: అంబాజీపేట మండలంలోని ఇరుసముండ గ్రామంలో రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో అంబాజీపేట మండలం తహసీల్దార్ వెంకటేశ్వరి పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో భూ సమస్యలు ఉండకూడదని, భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని తెలిపారు.