ప్రకాశం: సైబర్ నేరాలపై మరియు హెల్మెట్ల వినియోగంపై ద్విచక్ర వాహనదారులకు కంభం సీఐ కే.మల్లికార్జునరావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. హెల్మెట్లు ధరించి ప్రయాణించడం సురక్షితమన్నారు.