SKLM: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కుటుంబ సమేతంగా మంగళవారం ఎచ్చెర్ల టీడీపీ నాయకులు విజయనగం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగంలో ఏర్పాటు చేయబోతున్న మహిళల సమావేశానికి రాష్ట్రపతి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు AP రాష్ట్ర చేనేత కార్మికులు నేసిన చీరను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.