KMM: సత్తుపల్లి మండల పరిధిలో జరుగుతున్న హైవే రోడ్డు నిర్వాసిత రైతుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కాంగ్రెస్ నేత దయానంద్ సింగరేణి అధికారులను కోరారు. మంగళవారం రేచర్ల, లింగపాలెం రైతులతో కలిసి సింగరేణి పిఓను కలిసి వినతి పత్రం అందించారు. హైవేలో భూములు కోల్పోయిన రైతులకు ఇంకా పరిహారం అందలేదని, తక్షణమే వారికి పరిహారం అందే విధంగా చూడాలని అధికారులను కోరారు.