ADB: ఉట్నూర్ పట్టణంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏజెంట్ల నియామకంపై మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ అధ్యక్షులు ధరణి రాజేష్, బాబా శ్యాం టైగర్, కాంగ్రెస్ అధ్యక్షులు ఖయ్యూం ఉన్నారు.