ELR: పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో రైతులను మోసం చేసి స్వర్ణ కేళీ రకం విత్తనాలు అంటగట్టారని ఇవి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని జిల్లా కౌలు రైతుల సంఘం ఉపాధ్యక్షుడు కేతా గోపాలన్ తెలిపారు. 1318 రకం సాగు చేసిన రైతులు ఎకరాకు 35 బస్తాలు దిగుబడి సాధిస్తే స్వర్ణ కేరళీయ రకం సాగుచేసి 12 నుంచి 14 బస్తాలు మాత్రమే దిగుబడి సాధించారని అన్నారు.