ASR: అరకు సీడాప్ స్కిల్ కళాశాల విద్యార్ధులు ఇటీవలే పాల్గొన్న స్కైప్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారిలో 10 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ వర్మ తెలిపారు. ఈ అపాయింట్మెంట్ లెటర్లను స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ PSN మూర్తి విద్యార్ధులకు అందించారు. నోవోటెల్ 8 మందికి, రాడిసన్ బ్లూ హోటల్ ఇద్దరకు ఆఫర్ లెటర్లు ఇచ్చామన్నారు.