AP: తిరుపతిలో కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన శుభసూచికం అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘న్యాయవ్యవస్థ మరింత బలోపేతమవుతోంది. నూతనంగా వచ్చే న్యాయవాదులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు తమకు న్యాయం జరగాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. న్యాయవాదులు సరిగ్గా ఆలోచిస్తేనే వారికి సరైన న్యాయం జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.