సిద్దిపేట పోలీస్ సిబ్బందిలో పని ఒత్తిడి తగ్గించి, క్రీడా స్ఫూర్తిని నింపేందుకు నిర్వహించిన ‘కమిషనరేట్ ఛాంపియన్స్ లీగ్-2026’ శనివారం ముగిసింది. ముగింపు వేడుకలకు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు ట్రోఫీలు అందజేశారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఈ సందర్భంగా సీపీ పేర్కొన్నారు.