పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి రాష్ట్రంలోని 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే తొలి విడతలో 152 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా, మొత్తంగా బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మే 4న బెంగాల్‌తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.