GDWL: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 13 ఫిర్యాదులు అందాయి. ఇందులో భూ వివాదాలపై 6, గొడవలకు సంబంధించి 2, భార్యాభర్తల సమస్యలపై 2, ఇతర అంశాలపై 3 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం ఫిర్యాదుదారుల కోసం ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటుందని తెలిపారు.