SRD: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా 6 రోజుల ప్రత్యేక అవగాహన సదస్సులను సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం ప్రారంభించారు. షీ-టీమ్, భరోసా బృందాల ఆధ్వర్యంలో బాలల రక్షణ,యువత అభివృద్ధి, మాదక ద్రవ్యాల అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.