AP: ఆంధ్ర విశ్వవిద్యాలయం(AU) దేశంలోనే టాప్-5 విద్యాసంస్థల్లో ఒకటిగా నిలవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున రూ.500 కోట్ల నిధులు ఇస్తామని, మరో రూ.500 కోట్లు కార్పస్ ఫండ్ రూపంలో అభివృద్ధి కావాలని పేర్కొన్నారు. ఏయూ పూర్వ విద్యార్థులు తలచుకుంటే ఏదైనా సాధ్యమని, వర్సిటీని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంలో వారంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.